హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోరు మోటార్ల కాపర్‌ వైర్ల చోరీలతో కలకలం

GDWL: వడ్డేపల్లి మండలం కొంకల, జులేకల్‌ గ్రామాల్లో బోరు మోటార్ల కాపర్‌ వైర్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు 150 మంది రైతులకు నష్టం వాటిల్లింది. ఈ నెల 20న చోరీకి పాల్పడుతున్న ఎనిమిది మందిలో ఇద్దరిని రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీడియో ఆధారాలున్నా ఎఫ్‌ఐఆర్‌లో గుర్తుతెలియని వ్యక్తులుగా నమోదు చేయడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.