హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్తగారి ఊరికి వెళ్తూ అనంతలోకాలకు..

RR: షాబాద్‌కు చెందిన చొక్కంపేట పెంటయ్య (75) బస్సులో చేవెళ్ల మండలం గుండాల గేటు వద్ద దిగి అస్వస్థతకు గురయ్యారు. సమీపంలోని చెట్టు కింద కూర్చున్న ఆయన అక్కడే ప్రాణాలు విడిచారు. అత్తగారి ఊరిలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. పెంటయ్యకు భార్యాపిల్లలు లేరని, గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని, ఎవరిపైనా అనుమానం లేదని ఆయన తమ్ముడు, బంధువులు తెలిపారు.