హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయంలో వైభవంగా కార్తీకదీపోత్సవం

NGKL: అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివలింగానికి అభిషేకాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగగా, భక్తులతో కిటకిటలాడింది.