PPM: గరుగుబిల్లి మండలంలో ఐదు గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికైన అభ్యర్థులను కురుపాం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అభినందించారు. గుమ్మలక్ష్మీపురంలోని తన స్వగృహంలో వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు అభినందనలు


