హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొమ్మిదేళ్ల తర్వాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు

కాకినాడ నగరపాలక సంస్థకు తొమ్మిదేళ్ల తర్వాత గురువారం ఎన్నికలు జరగనున్నాయి. చివరిసారిగా 2017 ఆగస్టు 29న ఎన్నికలు జరగ్గా, 2022లో పాలకవర్గం గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధి మందగించాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలకవర్గంతో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.