హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరాటేలో పుంగనూరు విద్యార్థుల పతకాల పంట!

CTR: పాలకొండలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పుంగనూరు విద్యార్థులు పతకాలు సాధించి ప్రతిభ చాటారు. ఈ విషయాన్ని మాస్టర్ సదాశివ తెలిపారు. అండర్‌-14 విభాగంలో జశ్వంత్, అండర్‌-17లో మోక్షజ్ఞ రజత పతకాలు సాధించారు. అండర్‌-19లో తేజేష్ కుమార్, అండర్‌-17లో మహేష్ నాయక్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.