KMR: తాడ్వాయి మండలం ఎండ్రాయల్ గ్రామంలో మంగళవారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షుడు బాణాల పెద్ద గంగారెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులను ఎదిరించి స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప యోధుడు నరసింహారెడ్డి అని కొనియాడారు.
తెలంగాణ
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళులు


