హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముడావత్ మోహన్

KMR: మాచారెడ్డి మండలం బంజేపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముడావత్ మోహన్ నియమితులయ్యారు. మంగళవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నౌసిలాలూ నాయక్, మండల నాయకులు శీను, అనిల్ పాల్గొన్నారు.