హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంటల్లో చిక్కుకుని చిన్నారి మృతి!

NDL: కొత్తపల్లి మండలం బలపాలతిప్పలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలోని ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడు ధర్మ కిరణ్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.