BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు జిల్లాలో పర్యటించనున్నారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కుడునూరు, దేవరపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించడంతో పాటు చెర్లలో గిరిజన బాలికల వసతి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కార్యాలయం కోరింది.
తెలంగాణ
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన


