CTR: కార్వేటినగరం మండలం చింతమండి క్రాస్ వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈదువారిపల్లికి చెందిన మురుగయ్య చిత్తూరు–పుత్తూరు మార్గంలో బైక్పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం పళ్లిపట్టులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
బైక్ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు


