హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

VZM: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గరివిడి మండలం వీపీరేగ గ్రామంలో ప్రమాదవశాత్తు గెడ్డలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వీరు ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన ఎర్రవెల్లి వర్ష(4), ఎర్రవెల్లి ధనుష్(7) కావడం మరింత విషాదాన్ని నింపుతోంది. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.