విశాఖ దక్షిణ నియోజకవర్గం 40వ వార్డు ఎస్సీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి కృషితో జీవీఎంసీ నిధులు రూ.5.20 లక్షలతో నూతన పైపులైన్ల నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సదుపాయం కల్పించడమే లక్ష్యమని కార్పొరేటర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యకు పరిష్కారం


