NDL: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రంలో నేటి సాయంత్రం జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రధాన గేటు వద్ద గల గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొననున్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో శివదీక్ష చేపట్టి పౌర్ణమి వేడుకల్లో MLA పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో నేడు జ్వాలాతోరణం


