హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రచారానికి కౌంట్‌డౌన్.. నేటితో ముగింపు!

PLD: నరసరావుపేట మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగింపు పలకాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం-1964, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపివేయాలని పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచించారు.