హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి 100మంది చేరిక

ASR: కొయ్యూరు మండలంలోని నల్లగొండ పంచాయతీలో వైసీపీకి చెందిన వార్డు సభ్యులు పల్లి చిన్నారావు, వంతల కుమారి తమ అనుచరులు సుమారు 100మందితో మంగళవారం టీడీపీలో చేరారు. రాష్ట్ర జీసీసీ మాజీ ఛైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.