హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మార్పు' పథకం పనులు వేగవంతం చేయాలి'

GNTR: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల రూపురేఖలను మార్చి, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన 'మార్పు' పథకం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ‘మార్పు' పథకం అమలుపై మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.