WG: శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆకివీడు CI కాళీ చరణ్ స్పష్టం చేశారు. మండలంలోని చెరుకుమిల్లి గ్రామంలో మంగళవారం ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు శాంతియుతంగా ఓటు వేయాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో SI శుభ శేఖర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'


