హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండ్రాపూడి పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం

కృష్ణా: పామర్రు మండలం ఉండ్రాపూడి గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. జనసేన నేత మేక గోవర్ధన్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, గ్రామంలో ఐక్యతను కాపాడటమే లక్ష్యంగా గ్రామ పెద్దలు, ప్రజలు సమష్టిగా చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.