హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచలం దేవస్థానానికి జాతీయ గుర్తింపు

VSP: సింహాచలం దేవస్థానానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ‘ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ జాతీయ ధ్రువీకరణ లభించింది. భక్తులకు నాణ్యమైన, సురక్షితమైన అన్నప్రసాదాలు అందించడంలో పాటిస్తున్న ఆహార భద్రతా ప్రమాణాలకు గుర్తింపుగా రెండేళ్ల కాలపరిమితితో ఈ సర్టిఫికెట్‌ జారీ చేశారు. మంగళవారం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావుకు జిల్లా ఆహార భద్రతాధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.