SS: ధర్మవరం సబ్ డివిజన్‌లో ఈ నెల 26న జరిగే తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతామని, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ : SP


