హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

AKP: పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ కేసుల త్వరిత పరిష్కారానికి డిసెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటారు ప్రమాదాలు, కుటుంబ, కార్మిక వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ తీర్పు శాశ్వతమని, అప్పీల్‌కు అవకాశం ఉండదని తెలిపారు.