హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దూసుకెళ్లిన లారీ.. తప్పిన ప్రమాదం

ELR: కుక్కునూరు మండలంలోని అమరవరం- రాజీవ్‌నగర్ గ్రామాల మధ్య మంగళవారం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. కుక్కునూరు నుంచి భద్రాచలం వెళ్తున్న లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో ఇతర వాహనాలు, జనాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.