హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

GNTR: చుండూరు రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం తొలుత తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు, అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెనాలి రైల్వే ఎస్ఐ సరస్వతి తెలిపారు.