PLD: నరసరావుపేట 35వ వార్డు వామపక్షాలు బలపర్చిన సీపీఐ అభ్యర్థి కాసా రాంబాబును గెలిపించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం కమిటీలు ఇంటింటి ప్రచారం నిర్వహించాయి. పట్టణాభివృద్ధి, సమస్య పరిష్కారం, ఇళ్ల పట్టాల సాధన సీపీఐ పోరాటాలతోనే సాధ్యమయ్యాయని నాయకులు వై.చెంచయ్య, ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో రాంబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఆంధ్రప్రదేశ్
వామపక్ష అభ్యర్థికి మద్దతుగా విస్తృత ప్రచారం


