NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దర్శనం టికెట్ల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడిన నలుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. గత మూడు నెలల్లో నలుగురిని విధుల నుంచి తొలగించినట్లు దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై అక్రమాలు.. నలుగురిపై వేటు


