హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన మేయర్

ELR: 41 రోజుల మండల దీక్షను నియమనిష్టలతో పూర్తి చేసిన ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడు కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సహచర స్వాములతో కలిసి స్వామివారికి ఇరుముడి సమర్పించారు. ఏలూరు నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, నగర అభివృద్ధికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.