హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థిని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి'

PPM: కేజీబీవీలో మృతి చెందిన విద్యార్థిని పత్తిక నందిక కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.