హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

25న భారీ జాబ్ మేళా

తూర్పుగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉదయం 9 గంటలకు రాజమండ్రి బొమ్మూరు కలెక్టరేట్ ఆవరణలోని NAC-ASTI కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి బి.హరిశేషు తెలిపారు. 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఫార్మసీ, ప్రొడక్షన్, సేల్స్, ఇన్సూరెన్స్, టెక్నీషియన్ విభాగాల్లో 246 ఉద్యోగాలు కల్పిస్తాయని వివరించారు.