KDP: పులివెందుల పట్టణంలోని కదిరి ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు చక్రం ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును పక్కకు నిలపడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నడిరోడ్డుపై ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం


