W.G: ఆకివీడు మండలంలో డిసెంబర్ 2న జరగనున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని రూరల్ సీఐ కాళీ చరణ్ అన్నారు. మంగళవారం మండలంలోని చెరుకుమిల్లి గ్రామంలో ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. శాంతిభద్రతలకు విగాసం కలగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని లేకుంటే చర్యలు తప్పవు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శుభ శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించండి: సీఐ


