హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

ఏలూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కె.ప్రతాప్‌ శివ కిషోర్‌ తెలిపారు. 11 మండలాల్లోని 177 పంచాయతీలు, 1,896 వార్డులకు 68 రూట్లుగా విభజించి బలగాలను నియమించామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.