హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్లను తనిఖీ చేసిన డీఆర్ఎం

ATP: దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని ఏర్పేడు, మామండూరు రైల్వే స్టేషన్లను డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్ర ఎస్. గుప్తా మంగళవారం తనిఖీ చేశారు. బ్రాంచ్ అధికారులతో కలిసి ఆయా స్టేషన్లలోని ప్రయాణికుల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, నిర్వహణ తీరును ఆయన సమీక్షించారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు స్టేషన్ పరిసరాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు.