హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

AKP: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. దేవుడు నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాంబిల్లిలో గోడపత్రికను ఆవిష్కరించారు. నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు, కనీస వేతనం రూ.42 వేలకు పెంపు, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు, కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు.