హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక పౌర్ణమి వేళ కిక్కిరిసిన శైవక్షేత్రాలు!

బాపట్ల: కార్తీక పౌర్ణమి సందర్భంగా చీరాల, పేరాల, జాండ్రపేటలోని శైవక్షేత్రాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో మహిళలు తులసి, ఉసిరి చెట్ల వద్ద దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వాడరేవు, రామాపురం, సముద్ర తీరాల్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, సముద్రంలో కార్తీక దీపాలు వదులుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు.