హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త తొక్కుడువలసలో తాగునీటి కష్టాలు

PPM: గంగాపురం పంచాయతీ కొత్త తొక్కుడువలసలో తాగునీటి సమస్యతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి ట్యాంకు రెండేళ్లుగా పాడైపోయినా కొత్త ట్యాంకు ఏర్పాటు చేయలేదు. మోటారు నీరు నిల్వ లేక బురదలో కలుషితమవుతోంది. ఈ నీరు తాగి గ్రామస్థులు జ్వరాల బారిన పడుతున్నారు. పలుమార్లు అధికారులకు చెప్పినా పరిష్కారం లేదు. కొత్త ట్యాంకు ఏర్పాటు చేయాలనీ స్థానికులు కోరారు.