హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి వేళ శివాలయానికి పోటెత్తిన భక్తులు

MLG: కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని శివాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, 365 వత్తులతో దీపారాధన చేశారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.