HNK: ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుమారస్వామి (56) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఆయన ఈ నెల 20న పురుగు మందు తాగగా కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


