రంగారెడ్డి: శంకర్పల్లి మున్సిపాలిటీలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయాన్నే మహిళలు తులసి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తితో 365 ఒత్తుల దీపాలను వెలిగించారు. ఈ పవిత్ర దినాన తులసి కోట వద్ద 365 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి, కుటుంబాలకు అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
తెలంగాణ
ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు


