హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీలో విద్యార్థినిపై పీఈటీ దాడి.. భుజానికి గాయం

BDK: అన్నపురెడ్డిపల్లి కేజీబీవీలో పదో తరగతి విద్యార్థినిపై గెస్ట్ పీఈటీ దాడి చేసినట్లు ఆరోపణలు కలకలం రేపాయి. స్నాక్స్ బాక్స్ తీసుకురాలేదనే కారణంతో కర్రతో కొట్టడంతో వాసవి (16) భుజానికి తీవ్ర గాయమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు.