KMM: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. సోమవారం నాటికి మొత్తం 88,512 కుటుంబాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. 428 క్యాంపుల ద్వారా సోమవారం 32,610 నమోదులు జరిగాయి. తిరుమలాయపాలెం, రఘునాథపాలెంలో అత్యధికంగా 37 చొప్పున క్యాంపులు నిర్వహించారు. నేలకొండపల్లిలో 15 క్యాంపులలో 3,412 కుటుంబాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
జిల్లాలో జోరుగా ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ


