హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుజాతనగర్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు హర్షం

BDK: సుజాతనగర్ ప్రాంతంలో నూతన విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతుల సాధనలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కృషిపై పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రైతులు, స్థానికులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలకతీతంగా పూలబొకేలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.