హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 3న ఏడుపాయల ఆలయ హక్కులకు వేలం

MDK: ఏడుపాయల వనదుర్గాభవాని దేవస్థానంలో తలనీలాలు, కొబ్బరి ముక్కల సేకరణ, పార్కింగ్, ఎగ్జిబిషన్ హక్కులకు డిసెంబర్ 3న సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈవో వీరేశం తెలిపారు. ఆ రోజు ఉ.10.30 నుంచి మ.12 వరకు టెండర్లు స్వీకరించి, 12.30కు వేలం వేస్తామన్నారు. వివరాలకు ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.