హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృథా నీటికి అడ్డుకట్ట వేసిన సర్పంచ్

PDPL: కమాన్పూర్ మండలం కిష్టంపల్లి గ్రామంలో వృథాగా పోతున్న బోరు తాగునీటికి సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ అడ్డుకట్ట వేశారు. 13వ వార్డు సభ్యుడు తూటి రాజు ఆధ్వర్యంలో పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీటిని డ్రైనేజీకి అనుసంధానం చేశారు. దీంతో నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య సమస్యలు తొలగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రఫిక్, వార్డు సభ్యులు ఉన్నారు.