ASF: తిర్యాణి మండల కేంద్రంలో ZPHSలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ హరిత పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొని నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ.. మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలన్నారు.
తెలంగాణ
పాఠశాల నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్ హరిత


