హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

ASF: ఆసిఫాబాద్ జిల్లా SP నితికా పంత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.