హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: ఎస్సై

NRML: కుబీర్ మండలం గోడ్సారాలో సోమవారం గంజాయి గస్తీ కార్యక్రమంలో భాగంగా పోలీసులు అవగాహన కల్పించారు. ఎస్సై కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి సాగు, విక్రయాలు, రవాణా, వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.