హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

జోగులాంబ గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఉదయం 9 గంటలకు అండర్-10, 12, 14, 16, 18, 20 విభాగాల్లో బాలురు, బాలికలకు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బీసన్న, కార్యదర్శి సతీష్‌కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 30న రాష్ట్ర సబ్ జూనియర్ మీట్‌లో, వచ్చే నెల 6న క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొంటారు.