హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రాకతో పోడు భూములకు పట్టాలు దక్కేనా?

NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని బక్క లింగాయపల్లి, అక్కారం గ్రామాల్లో పట్టాలు లేని సుమారు 650 ఎకరాల పోడు భూముల సమస్యకు సీఎం పరిష్కారం చూపి తీపి కబురు అందిస్తారని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు.