NGKL: చారకొండ మండలం సిరసనగండ్లలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఇవాళ కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ డేరం రామశర్మ తెలిపారు. ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్తీకంలో దానం శుభప్రదమని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక పూజలు


